జగ్గయ్యపేట: నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేసే విధంగా చర్యలు
గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రజలకు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేసే విధంగా చర్యలు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాతయ్య సూచించారు. శనివారం జగ్గయ్యపేట మండలం వేదాద్రి గ్రామంలో విద్యుత్ శాఖ అధికారులతో కలిసి ఆర్డిఎస్ఎస్ పథకం ద్వారా ఏర్పాటు చేయనున్న విద్యుత్ సరఫరా లైనులను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి గ్రామంలో త్రీఫేస్ లైన్ల ద్వారా కరెంటు సరఫరా అవుతున్నట్లు తెలిపారు.