జగ్గయ్యపేట: బంగారంతో ఉడాయించిన కారు డ్రైవర్
ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో రూ.10 కోట్ల విలువైన బంగారంతో కారు డ్రైవర్ ఉడాయించాడు. 7 కిలోల బంగారంతో పరారైన కారు డ్రైవర్ జితేష్ పరారయ్యాడు. ఆదివారం బంగారు వ్యాపారాలు కార్ బుక్ చేసుకున్నారు. డ్రాపింగ్ కి జితేష్ వెళ్ళాడు. వ్యాపారులను పిక్ చేసుకొని వెళ్తుండగా, మార్గ మధ్యలో టీ తాగడానికి దిగగా, డ్రైవర్ బంగారంతో ఉడాయించారు. పోలీసులకు తెలుపగా,కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.