పేర్ని కుటుంబంపై కొల్లు ఫైర్

69చూసినవారు
పేర్ని కుటుంబంపై కొల్లు ఫైర్
కృష్ణా జిల్లా మచిలీపట్నంలో బుధవారం రుద్రవరం నందు మాజీ మంత్రి కొల్లు రవీంద్ర మీడియా సమావేశంలో పాల్గొన్నారు. నియోజకవర్గంలో పేర్ని నాని కుటుంబం అనేక అరాచకాలకు పాల్పడుతోందని తెలిపారు. రాజ్యాంగ వ్యవస్థను చేతులకు తీసుకొని తాలూకా పోలీస్ స్టేషన్లో పోలీసులపైనే తిరగబడటం హేయమైన చర్య అని విమర్శించారు. ఎస్సై పై దాడి చేస్తే కనీసం సామాన్య ప్రజలకు రక్షణ ఏముంటుందని ప్రశ్నించారు.

సంబంధిత పోస్ట్