మైలవరం: తక్షణమే రహదారుల మరమ్మతులు నిర్వహించాలి: ఎమ్మెల్యే
విజయవాడ రూరల్ మండలం గొల్లపూడిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పంచాయతీ రాజ్ శాఖ పరిధిలో నిర్మించిన రహదారుల మరమ్మతులపై మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ సంబంధిత అధికారులతో గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తక్షణమే రహదారులకు మరమ్మతులు నిర్వహించాలని అధికారులకు ఆదేశాలను జారీ చేశారు. పంచాయతీరాజ్ శాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.