కూటమి ప్రభుత్వం వంద రోజుల్లోనే ఎంతో అభివృద్ధి చేసి చూపించిందని నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అన్నారు. సోమవారం ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలం ఉస్తేపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం అందించిన సంక్షేమ ఫలాలను ప్రజలకు ఆమె వివరించారు. గ్రామస్థులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు.