పెడన నియోజకవర్గం కృత్తివెన్ను మండలం మునిపెడ దళితవాడలో శుక్రవారం అగ్ని ప్రమాదం జరిగింది. గ్రామస్థుల వివరాల మేరకు. పాడి రైతులు నల్లగంగుల మోషే, అహరోను పది ఎకరాల గడ్డి వాము ఏర్పాటు చేశారు. శుక్రవారం వాము దగ్ధమై దాదాపు రూ. 50 వేల ఆస్తి నష్టం వాటిల్లింది. అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటన ప్రాంతానికి వచ్చి మంటలను అదుపు చేశారు.