టీడీపీ సానుభూతిపరుడైన పెడన మండలం నందిగామ గ్రామ సర్పంచ్ చినబాబుపై వేసిన అనర్హత వేటుని ఎత్తి వేయాలని నియోజకవర్గ
టీడీపీ ఇంచార్జ్ కాగిత కృష్ణప్రసాద్ డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం మచిలీపట్నంలో జిల్లా కలెక్టర్ని కలిసి ఫిర్యాదు చేశారు. రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన చినబాబుపై ప్రత్యర్థి కోర్టుని ఆశ్రయించారని, అయితే కోర్టు నుంచి ఎటువంటి ఆదేశాలు రాకపోయినా అధికారులు ఆగమేఘాల మీద చినబాబును తొలగించారన్నారు.