తమ సమస్యలు పరిష్కరించేందుకు సహకరించాలని 108 సిబ్బంది మాజీ ఉపసభాపతి వేదవ్యాస్ ను ఆదివారం సాయంత్రం రాజుపేటలోని అయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా పలు డిమాండ్లను వారు వేదవ్యాస్ కు విన్నవించారు. సమస్యలు విన్న ఆయన న్యాయమైన కోర్కెలను పరిష్కరించేందుకు సంబంధిత శాఖ మంత్రితో చర్చిస్తానని హామీ ఇచ్చారు. తనవంతు సహకారం అందిస్తారని అన్నారు. వివిధ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని సిబ్బంది ఆయనకు అందజేశారు.