ప్రకాశం బ్యారేజీ నిర్మించాక ఎన్నడూ ఊహించని విధంగా కృష్ణానదికి వరద రావడం, వేలాది మంది నిరాశ్రయులవడం జరిగిందని, ఇదొక ప్రకృతి వైపరీత్యమని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు. గురువారం తాడిగడపలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందస్తు ప్రణాళికతో సర్వశక్తులు వడ్డారని అన్నారు.