ఏ. కొండూరు మండలంలో నకిలీ విత్తనాలు రైతులకు అమ్మిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని ఎన్టీఆర్ జిల్లా కౌలు రైతుల సంఘం జిల్లా కార్యదర్శి మేకల డేవిడ్ డిమాండ్ చేశారు. గురువారం ఈ మొక్కజొన్న విత్తనాలు సాగు చేసి నష్టపోయిన పంటలను ఆయన పరిశీలించారు. వేల రూపాయలు ఎకరానికి పెట్టుబడులు పెట్టి మొక్కజొన్న పంట దిగుబడి రాకపోవడంతో రైతులు అప్పుల బాధతో ఇబ్బందులు పడుతున్నారని ఆయన వాపోయారు.