ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గ ఏ. కొండూరు మండలంలో ఎన్డీయే కూటమి ఏర్పడి 100 రోజులు దిగ్విజయంగా పూర్తి చేసుకున్న సందర్భంగా మాధవరం గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో శుక్రవారం ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు విస్తృతంగా పర్యటించారు. ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వం తీసుకున్నఅభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రజలకు వివరించారు. కరపత్రాలను ఇంటింటికి అందజేస్తూ ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు.