ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని కలిసిన హోంమంత్రి అనిత
ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో హోంమంత్రి వంగలపూడి అనిత మంగళవారం సమావేశమయ్యారు. విజయవాడ ఉపముఖ్యమంత్రి కార్యాలయంలో జరిగిన సమావేశంలో రాష్ట్రంలోని శాంతిభద్రతలు, దీపావళి ముందస్తు భద్రతా ఏర్పాట్లపై ప్రధానంగా చర్చించారు. ఈ సందర్భంగా హోం మంత్రి అనిత మాట్లాడుతూ ఎక్కడ ప్రమాదం జరిగినా అప్రమత్తంగా ఉండేలా 185 అగ్నిమాపక స్టేషన్లను ఏర్పాటు చేయడమే కాకుండాసిబ్బందికి ఆదేశాలిచ్చినట్లు వెల్లడించారు.