అవనిగడ్డ: ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఊరుకోము

52చూసినవారు
అవనిగడ్డ: ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఊరుకోము
కూటమి ప్రభుత్వంపై మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఊరుకోమని టిడిపి రాష్ట్ర నాయకులు కనపర్తి శ్రీనివాస్ రావు హెచ్చరించారు. శుక్రవారం అవనిగడ్డలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యేను ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పి ఇంటి దగ్గర కూర్చోబెట్టారని తెలిపారు. టిడిపిలోకి వచ్చేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని ఆయనను ఎవరు చేర్చుకోరన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్