అవనిగడ్డ నియోజకవర్గంలోని 6 మండలాల టిడిపి నేతలు అసంతృప్తిని వ్యక్తం చేశారు. శుక్రవారం అవనిగడ్డలో నియోజకవర్గస్థాయి సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. నియోజకవర్గ టిడిపి పరిశీలకులు కనపర్తి శ్రీనివాస్ వద్ద టిడిపి శ్రేణులు తమ ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి గెలుపు కోసం అహర్నిశలు కష్టపడ్డామని, తమకు గుర్తింపు లభించడం లేదని పేర్కొన్నారు. వైసీపీలో నుంచి పార్టీలోకి వచ్చిన వారికే ప్రాధాన్యత కలిగిస్తున్నారన్నారు.