Nov 18, 2024, 11:11 IST/
రేపు వరంగల్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన
Nov 18, 2024, 11:11 IST
సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు. కాళోజీ కళాక్షేత్రం ప్రారంభోత్సవం, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలతో పాటు ఇందిరా మహిళా శక్తి విజయోత్సవ సభలో సీఎం పాల్గొననున్నారు. ముందుగా హైదరాబాద్ నుండి ప్రత్యేక హెలికాప్టర్లో మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాలకు వరంగల్ చేరుకుంటారు. ఆ తర్వాత ఆర్ట్స్ కాలేజీ మైదానంలో ఇందిరా మహిళా శక్తి మేళాలోని స్టాల్స్ సందర్శిస్తారు. అనంతరం ఇందిరా మహిళా శక్తి విజయోత్సవ సభలో పాల్గొని ప్రసంగిస్తారు.