Dec 27, 2024, 16:12 IST/
VIDEO: మన్మోహన్కు శ్రద్ధాంజలి ఘటించేందుకు సీడబ్ల్యూసీ సమావేశం
Dec 27, 2024, 16:12 IST
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్కు శ్రద్ధాంజలి ఘటించేందుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశమైంది. కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఛైర్మన్ సోనియా గాంధీ, లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీతోపాటు ఇతర కాంగ్రెస్ ముఖ్య నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. సీడబ్ల్యూసీ నేతలు మన్మోహన్ మృతికి సంతాపంగా రెండు నిమిషాలపాటు మౌనం పాటించారు.