రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని ప్రధాన కూడళ్లలో టౌన్ సీఐ వీర ప్రసాద్ ఆంధ్వర్యంలో శుక్రవారం వాహన తనిఖీలు చేపట్టారు. ప్రతి వాహనాలను ప్రత్యేకంగా తనిఖీ చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నియమాలు పాటించాలని వాహనదారులకు విజ్ఞప్తి చేశారు. నియమ నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రమాదాల నివారణకు నియంత్రిత వేగంతో ప్రయాణించాలని కోరారు