Feb 18, 2025, 15:02 IST/మంథని
మంథని
మంథని: రోగులకు ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి
Feb 18, 2025, 15:02 IST
ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని జిల్లా మెడికల్ సూపరింటెండెంట్ శ్రీధర్ అన్నారు. మంథని పట్టణంలోని ప్రభుత్వ సామాజిక వైద్యశాలను మంగళవారం సందర్శించి ఇన్ పేషెంట్, ఔట్ పేషెంట్ వివరాలు తెలుసుకున్నారు. కలెక్టర్ మంజూరు చేసిన నిధులతో 3 వార్డులలో మరమ్మతు పనులు చేపట్టి అందుబాటులోకి తెచ్చామని, రోగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలన్నారు.