గన్నవరం నియోజకవర్గంలో ఇరిగేషన్ శాఖకు సంబందించి ప్రధానంగా ఉన్న మూడు సమస్యలను పరిష్కరించండని
సంబందిత మంత్రిని కోరినట్లు శాసన సభ్యులు యార్లగడ్డ వెంకట్రావ్ తెలిపారు. ఈ మేరకు బుధవారం ఒక పత్రిక ప్రకటన విడుదల చేశారు. 1276 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న బ్రహ్మలింగయ్య చెరువు ను రిజర్వాయిర్ గా చేసేందుకు 2014-19 మధ్య అప్పటి టిడిపి ప్రభుత్వం నిధులు కేటాయించినా గత వైసిపి పాలనలో సోమ్మును డ్రా చేశారని విమర్శించారు.