గన్నవరం: నైపుణ్యాల ద్వారానే ఉద్యోగ అవకాశాలు
నైపుణ్యాల ద్వారానే ఉద్యోగ అవకాశాలు వస్తాయని గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావ్ తెలిపారు. సోమవారం ఉంగుటూరు మండలం ఆత్కూరు స్వర్ణ భారత్ ట్రస్ట్ లో నైపుణ్య శిక్షణ పొందుతున్న యువతీ యువకులతో ఏర్పాటు చేసిన ముఖా ముఖిలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుతో కలసి ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు పాల్గొన్నారు.