ఘంటసాల: సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి
సైబర్ క్రైం నేరాల పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఘంటసాల ఎస్ఐ ప్రతాప్ రెడ్డి సూచించారు. పోలీసు అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా గురువారం ఘంటసాలలోని ఆచార్య ఎన్. జి. రంగా వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థినులకు సైబర్ నేరాల పట్ల అవగాహన కల్పించారు. ఆయన మాట్లాడుతూ లోన్ యాప్ లను నమ్మి మోసపోవద్దని తెలిపారు. ఆన్లైన్ లింక్ లను క్లిక్ చేయటం ద్వారా బ్యాంక్ అకౌంట్ నుంచి నగదు కోల్పోయే ప్రమాదం ఉందన్నారు.