ఘంటసాల: మద్యం షాపు ఏర్పాటు చేయొద్దని వినతి

66చూసినవారు
ఘంటసాల: మద్యం షాపు ఏర్పాటు చేయొద్దని వినతి
ఘంటసాలలో మద్యం షాపు ఏర్పాటు చేయవద్దని స్థానికులు తహసీల్దార్ విజయప్రసాద్ కు వినతిపత్రం మంగళవారం అందజేశారు. స్థానిక మల్లంపల్లి రోడ్డులో ఉన్న మద్యం షాప్ ద్వారా తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు స్థానికులు తహసీల్దార్ కు వివరించారు. కనీసం మహిళలు బయటకు వెళ్లేందుకు కూడా అభ్యంతరకరంగా ఉందని తెలిపారు. షాపును వేరే ప్రాంతానికి తరలించాలని ప్రజలు కోరారు.

సంబంధిత పోస్ట్