ఘంటసాల: గండిని పూడ్చాలని గ్రామస్తుల వినతి
ఘంటసాల మండల పరిధిలోని పాపవినాశనం ఇసుక క్వారీలోకి వెళ్లే రహదారిలో కొందరు కావాలని ఏర్పాటుచేసిన గండిని పూడ్చాలని గ్రామస్తులు కోరుతున్నారు. మంగళవారం వారు మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా ఎడ్ల బండ్ల ద్వారా ఇసుక తోలుకునేందుకు అవకాశం కల్పించిందన్నారు. కానీ కొందరు వ్యక్తులు ఎడ్లబండ్లు క్వారీలోకి వెళ్లకుండా గండి కొట్టారని తెలిపారు. తక్షణమే అధికారులు స్పందించాలని వారు కోరారు.