రైతులకు మరింత మేలు జరిగేలా కాలువలను అభివృద్ధి చేస్తున్నామని గుడివాడ నియోజకవర్గం ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పేర్కొన్నారు. గురువారం ఇరిగేషన్, డ్రైనేజీ కాలువల్లో చెయ్యనున్న అభివృద్ధి పనులపై అధికారులతో ఎమ్మెల్యే రాము తన స్వగృహంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. నెహ్రాలి, మోటూరు ఛానల్, భూమికోడు తదితర కాల్వలు, డ్రైన్లలో జరగనున్న అభివృద్ధి పనుల వివరాలను ఎమ్మెల్యే రాముకు అధికారులు తెలిపారు.