గుడివాడ పట్టణ వెలమ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో స్వర్గీయ కేంద్ర మాజీ మంత్రి ఎర్రం నాయుడు 12 వర్ధంతి కార్యక్రమాలను శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏలూరు రోడ్డులోని ఎర్రంనాయుడు విగ్రహానికి సీనియర్ టిడిపి నాయకుడు డాక్టర్ గోర్జి సత్యనారాయణ, వెలమ సంక్షేమ సంఘ పెద్దలు పూల మాలలతో నివాళులర్పించారు. ఎమ్మెల్యే నుండి ఎంపీగా, కేంద్రమంత్రిగా చేపట్టిన ప్రతి పదవికి వన్నె తెచ్చిన తెలుగు కిరణం అని కొనియాడారు.