నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం
132/33KV చిగురుకోట సబ్ స్టేషన్లో మరమ్మతుల నిమిత్తం శనివారం ఉ.10:00 గంటల నుంచి మధ్యాహ్నం 1:00గం. వరకు విద్యుత్ కోత విధించడం జరుగుతుందని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రామ కృష్ణ శుక్రవారం తెలిపారు.కలిదిండి మండల కేంద్రమైన కలిదిండి, పోతుమర్రు, కోరుకొల్లు, మూల లంక, కాళ్లపాలెం సబ్ స్టేషన్ల పరిధిలో గల గ్రామాలకు విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతుందని, కావున ప్రజలందరూ విద్యుత్ శాఖకు సహకరించాలని కోరారు.