కోడూరు: మత్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది
మత్యకారులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ అన్నారు. మంగళవారం కోడూరు ఇండోర్ స్టేడియం వద్ద కోడూరు, నాగాయలంక మండలాల మత్స్యకారులకి 239 ఐస్ బాక్స్ ల పంపిణి కార్యక్రమం నిర్వహించారు. ఈకార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి, మాజీ రాజ్యసభ సభ్యులు కనకమేడల రవీంద్ర విచ్చేసి లబ్ధిదారులకు బాక్సులు అందించారు.