తెలుగు సంస్కృతికి సంప్రదాయాల కలగలుపు సంక్రాంతి సందర్భంగా ప్రపంచంలోని తెలుగు ప్రజలందరికీ సంక్రాంతి రాష్ట్ర గనులు భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర శుభాకాంక్షలు తెలిపారు. సోమవారం మచిలీపట్నంలో ఆయన మాట్లాడుతూ భోగభాగ్యాలనిచ్చే భోగి, పిల్లా పాపలతో, గంగిరెద్దుల కోలాహలంతో రైతన్నల సంక్రాంతి, పిండి వంటల ఘుమఘుమల కనుమ ప్రతి లోగిలిలో వెలుగులు నింపాలన్నారు. పాడి పంటలతో నిండుగా ఉండాలన్నారు.