ఇటీవల ప్రమాదవశాత్తు బుడమేరు వరదలో కొట్టుకుపోయి మరణించిన బందరు మండలం హుస్సేన్ పాలెం గ్రామానికి చెందిన మృతుడు కలిదిండి ఫణి కృష్ణ కుటుంబానికి వరదసాయంగా రూ. 5 లక్షల చెక్కును శనివారం మంత్రి కొల్లు రవీంద్ర మృతుని ఇంటి వద్ద అతని భార్య జ్యోతికి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మృతుని కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యంగా ఉండాలని వారిలో ఆత్మస్థైర్యం నింపారు. పిల్లల చదువులకు సహాయం చేస్తామన్నారు.