Oct 03, 2024, 13:10 IST/
జయం రవితో ప్రియాంక మోహన్ ఎంగేజ్మెంట్.. ఫొటో వైరల్!
Oct 03, 2024, 13:10 IST
నటుడు జయం రవి, నటి ప్రియాంక మోహన్లు ఎంగేజ్మెంట్ చేసుకున్నారని ఓ 'ఫోటో' ఆన్లైన్లో వైరల్ అవుతోంది. ఈ ఇద్దరూ రహస్యంగా ఎంగేజ్మెంట్ చేసుకున్నారని సోషల్ మీడియాలో నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. ప్రస్తుతం తన భార్య ఆర్తి నుండి విడాకులు తీసుకునే ప్రక్రియలో ఉన్న రవి.. తన రాబోయే చిత్రం బ్రదర్ విడుదలకు సిద్ధమవుతున్నాడు. ఈ చిత్రంలో జయం రవి, ప్రియాంక మోహన్ నటిస్తున్నారు. ఈ వైరల్ ఫోటో సినిమాలోనిదేనని సమాచారం.