రమణక్కపేటలో మైనర్ బాలిక అదృశ్యం
ముసునూరు మండల పరిధిలోని రమణక్కపేట గ్రామంలో మైనర్ బాలిక కిడ్నాప్ వ్యవహారంపై ఆదివారం రాత్రి ముసునూరు పోలీసులు ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేశారు. ఎస్సై చిరంజీవి తెలిపిన వివరాలు ప్రకారం ముసునూరు మండల పరిధిలోని రమణక్కపేట దళితవాడకు చెందిన మైనర్ బాలిక (17) గత రాత్రి అదృశ్యమైంది. దీనిపై మైనర్ బాలిక తల్లిదండ్రులు ముసునూరు పోలీసులకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు.