యాదవరెడ్డి క్రియాశీల పాత్ర పోషించారు: సీఎం రేవంత్

55చూసినవారు
యాదవరెడ్డి క్రియాశీల పాత్ర పోషించారు: సీఎం రేవంత్
తెలంగాణ ఉద్యమంలో యాదవరెడ్డి క్రియాశీల పాత్ర పోషించారని సీఎం రేవంత్ కొనియాడారు. రవీంద్రభారతిలో మంగళవారం యాదవరెడ్డి పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. తెలంగాణ బిల్లును ఆమోదించడంలో జైపాల్‌రెడ్డితో పాటు యాదవరెడ్డి పాత్ర మరువలేనిది అని చెప్పారు. తెలంగాణ ఉద్యమ చరిత్రను పుస్తక రూపంలో తీసుకురావాలని కోరారు. మోదీ అధికారంలోకి వచ్చాక భారత భూభాగాన్ని కోల్పోయామని, మణిపూర్‌ లో అంతర్యుద్ధం జరుగుతోందన్నారు.

సంబంధిత పోస్ట్