Jan 17, 2025, 14:01 IST/పెద్దపల్లి
పెద్దపల్లి
పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: పెద్దపల్లి ఎమ్మెల్యే
Jan 17, 2025, 14:01 IST
పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణరావు అన్నారు. శుక్రవారం ఎలిగేడు మండల మండల పరిషత్ కార్యాలయంలో పలు గ్రామాలకు చెందిన 30 మంది కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు రూ. 30, 03, 480 విలువ గల చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సామ రాజేశ్వర్ రెడ్డి, తహశీల్దార్ బషీరుద్దీన్, ఎంపీడీవో భాస్కర్ రావు, నాయకులు, అధికారులు పాల్గొన్నారు.