జి. కొండూరు మండలం, చెర్వుమాధవరం గ్రామములో ప్రభుత్వ పాఠశాల నుండి రైల్వే గేటుకు వెళ్లే డొంక రోడ్డులో వర్షం పడినప్పుడు రైతులు పొలాలకు వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నారాని, రైతుల ఇబ్బందుల దృష్ట్యా నూతనంగా 25. 00 లక్షల రూపాయలతో వంతెనను నిర్మించడం జరిగింది. నూతనంగా నిర్మించిన వంతెనను జి. కొండూరు మండల ఎంపీపీ వేములకొండ లక్ష్మి తిరుపతమ్మ స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు.