కూటమి ప్రభుత్వంలో రోడ్లకు మహర్దశ రాబోతుందని పామర్రు నియోజకవర్గం శాసనసభ్యులు వర్ల కుమార్ రాజా తెలిపారు. బుధవారం ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 1500 కి. మీ. మేర పూర్తిగా దెబ్బతిన్న రోడ్లను పునర్నిర్మించడంతో పాటు 23, 000 కి. మీ. మేర యుద్ధ ప్రాతిపదికన సంక్రాంతి నాటికి గుంతల్లేని రహదారులుగా సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించినట్లు తెలిపారు.