పామర్రు: గ్రామాల్లో విచ్చలవిడిగా బెల్ట్ షాపుల నిర్వహణ
పెదపారుపూడి మండలంలోని గ్రామాల్లో బెల్ట్ షాపులు ఉదయం 5 గంటల నుండి మొదలై అర్ధరాత్రి ఒంటిగంట వరకు కొనసాగుతున్నాయి. మద్యం అమ్మకాలు, ప్రభుత్వ అనుమతితో నడిచే వైన్ షాపులు ఉదయం 10 గంటల నుండి రాత్రి పది గంటల వరకు కొనసాగుతాయి. కానీ బెల్ట్ షాపులకు మాత్రం జెండా పండుగ, గాంధీ జయంతి పండుగ అనే తేడా లేకుండా 24 గంటలు మద్యం అమ్మకాలు జరుగుతుండడం విశేషం.