పెడన పట్టణ శివారు ప్రాంతాల నుంచి ఇష్టారాజ్యంగా ఆదివారం మట్టిని తవ్వేసి బయటికి తరలించారు. ఇటుకల బట్టీలలో వాడేందుకు, రియల్ఎస్టేట్ వెంచర్లలో రోడ్లు వేసేందుకు ఈ మట్టి ఉపయోగ పడుతుండడంతో చెరువులోని మట్టిని ఎక్కడ పడితే అక్కడ ఎక్సకవేటర్లతో తవ్వి ట్రాక్టర్లతో తరలిస్తూ అక్రమార్కులు సొమ్ము చేసుకుంటున్నారు. పట్టణానికి 10 కిలోమీటర్ల దూరంలో పలు చెరువుల నుంచి కూడా మట్టిని తవ్వి సొమ్ము చేసుకుంటున్నారు.