ఏపీ మాజీ సీఎం జగన్ కడప పర్యటన ముగించుకుని తాడేపల్లికి చేరుకున్నారు. మార్గమధ్యలో విజయవాడ కృష్ణలంక ఏరియాలోని రిటైనింగ్ వాల్ వద్ద కృష్ణా నది వరద ప్రవాహాన్ని పరిశీలించారు. సోమవారం మధ్యాహ్నం 3గంటలకు విజయవాడలోని వరద బాధిత ప్రాంతాల్లో ఆయన పర్యటించనున్నారు. కాగా జగన్ సీఎంగా ఉన్న సమయంలో కట్టించిన రిటైనింగ్ వాల్ వల్లే తమ ప్రాణాలు నిలిచాయని స్థానికులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపినట్లు వైసీపీ ట్వీట్ చేసింది.