నిజాలు నిర్భయంగా వార్తలు రాసే విలేకరిపై దాడి చేయడం గర్హనీయమని హెచ్‌పిఎస్ రాష్ట్ర కార్యదర్శ ఏ నూర్ అహ్మద్ అన్నారు. ఆదివారం ఆదోనిలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రతినిత్యం దినపత్రిక విలేకరి ప్రకాష్‌పై దాడికి పాల్పడిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విలేకరులకు రక్షణ కల్పించి న్యాయం చేసి భవిష్యత్తులో పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.