![అందరికీ అడ్మిషన్లు ఇవ్వాలిఃఎస్ఎఫ్ఐ అందరికీ అడ్మిషన్లు ఇవ్వాలిఃఎస్ఎఫ్ఐ](https://media.getlokalapp.com/cache/d9/ed/d9ed28fde5a92fb59322ede24471e2d0.webp)
అందరికీ అడ్మిషన్లు ఇవ్వాలిఃఎస్ఎఫ్ఐ
చదువుకుంటామని దరఖాస్తు చేసుకున్న విద్యార్థులందరికీ పాఠశాలల్లో అడ్మిషన్లు ఇవ్వాలని ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాసులు డిమాండ్ చేశారు. బుధవారం ఆదోనిలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఆదోనిలోని వాల్మీకి నగర్, హనుమాన్ నగర్ ప్రాంతాల్లో హైస్కూలు ఏర్పాటు చేయాలన్నారు. సౌకర్యాలు లేవని, ఉపాధ్యాయుల కొరత ఉందని విద్యార్థులకు ఇబ్బందులకు గురిచేస్తే ఆందోళన చేస్తామన్నారు.