ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, భారత దేశ పౌరుడిగా మన బాధ్యత అని డియస్పీ శివ నారాయణ స్వామి అన్నారు. శుక్రవారం ఆదోని పట్టణంలో మొదటి సారి ఓటు వేస్తున్న యువతకు ఓటు హక్కుపై అవగాహన కల్పించారు. ఓటరు చైతన్యమే ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ డియస్పీ ధీరజ్, మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ అనుమప, వన్ టౌన్ పోలీసులు పాల్గొన్నారు.