రాష్ట్ర ఉద్యోగ, ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానం మాత్రమే అమలు చేయాలని పాత పెన్షన్ విధానం తప్ప ఏ విధానం ప్రత్యామ్నాయం కాదని యుటిఎఫ్ నంద్యాల జిల్లా కార్యదర్శి నరసింహారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ప్యాపిలి యుటిఎఫ్ ప్రాంతీయ కార్యాలయంలో ముఖ్య కార్యకర్తల సమావేశంలో అయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి
జగన్ మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్న సమయంలో సి పి యస్ విధానాన్ని రద్దు చేస్తామని మాట ఇచ్చి విస్మరించారని విమర్శించారు.