కోడుమూరులో రంజాన్ వేడుకల్లో పాల్గొన్న బొగ్గుల దస్తగిరి

78చూసినవారు
కోడుమూరు మండల కేంద్రం కోడుమూరుతోపాటు గ్రామాల్లో గురువారం రంజాన్ వేడుకలను ముస్లిం సోదరులు ఘనంగా జరుపుకున్నారు. రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని ముస్లిం సోదరులు నూతన వస్త్రాలను ధరించి పట్టణంలోని ఎమ్మిగనూరు రోడ్డువైపు ఉన్న ఈద్గా వద్ద చేరుకొని ప్రత్యేక నమాజు నిర్వహించారు. కోడుమూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బొగ్గుల దస్తగిరి కోడుమూరు ఈద్గాలో ముస్లింలతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

సంబంధిత పోస్ట్