నేడు మునగాలలో కబడ్డీ పోటీలు

81చూసినవారు
నేడు మునగాలలో కబడ్డీ పోటీలు
ఉగాది ఉత్సవాలను పురస్కరించుకుని గూడూరు మండల పరిధిలోని మునగాలలో గురువారం జిల్లా స్థాయి కబడ్డీ పోటీలను నిర్వహించనున్నట్లు నిర్వాహకులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఉగాది పండుగ సందర్భంగా గ్రామంలో ఏర్పాటు చేసిన పోటీల్లో గెలుపొందిన వారికి మొదటి బహుమతిగా రూ. 8,116, రెండో బహుమతి రూ. 6,116, మూడో బహుమతి రూ. 4, 116, నాలుగో బహుమతి రూ. 2,116 అందజేయనున్నట్లు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్