కన్నుల పండువగా వల్లెలాంబదేవి రథోత్సవం

69చూసినవారు
కన్నుల పండువగా వల్లెలాంబదేవి రథోత్సవం
కోడుమూరు పట్టణంలో ఉగాది పండుగ పురస్కరించుకొని వల్లెలాంబదేవి అమ్మవారి రథోత్సవం మంగళవారం కన్నుల పండువగా సాగింది. ఈ వేడుకలను తిలకించేందుకు భక్తులు వేలాది సంఖ్యలో తరలివచ్చారు. ముందుగా రథాంగ హోమం చేపట్టారు. భక్తులు ఊరేగింపుగా వచ్చి అమ్మవారికి బోనాలు సమర్పించారు. అనంతరం అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని రథంపై ప్రతిష్టించారు. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి భక్తులు భారీ ఎత్తున కదిలివచ్చారు.

సంబంధిత పోస్ట్