అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం 2024 సెప్టెంబర్ 8న నిర్వహించబడుతుంది. ఈ ఏడాది అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం థీమ్ ‘‘బహుభాషా విద్యను ప్రోత్సహించడం.. పరస్పర అవగాహన, శాంతి కోసం అక్షరాస్యత’’. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ భాషల సమన్వయంతో శాశ్వతమైన శాంతి సాధనకు ఉన్న సమస్యలపై యునెస్కో దృష్టి పెడుతుంది. చట్టాలు, ప్రోగ్రామ్స్, పాలన, జీవత కాల అభ్యసన వ్యవస్థలను మెరుగుపర్చేందుకు సాధ్యమైన సొల్యూషన్స్‌ను అన్వేసిస్తుంది.