ప్రతి ఏడాది సెప్టెంబర్ 8న "అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం"గా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. నవంబర్ 17, 1965 సంవత్సరంలో యునెస్కో సభ్యదేశాల విద్యాశాఖ మంత్రుల మహాసభ అనంతరం అక్షరాస్యత దినోత్సవాన్ని ప్రకటించగా 1966 నుంచి జరుపుకుంటున్నాము. అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవ వేడుకలు వివిధ దేశాలలో అందరికీ విద్య అనే నినాదంగా లక్ష్యాలను చేర్చి కృషి చేస్తున్నాయి. ఇతర యునైటెడ్ నేషన్స్ కార్యక్రమాలు యునైటెడ్ నేషన్స్ అక్షరాస్యత డికేడ్ నిర్వహిస్తున్నవి.