పెద్దకడబూరు గ్రామంలోని పోలీసు స్టేషన్ ను శుక్రవారం కోసిగి సీఐ మంజునాథ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీసు స్టేషన్ లో రికార్డులను పరిశీలించారు. మండలంలోని ఆయా గ్రామాల్లో క్రైమ్ రేటును అడిగి తెలుసుకున్నారు. సమస్యాత్మక గ్రామాలు గురించి ఎస్ఐ మహేష్ కుమార్ ను అడిగి తెలుసుకున్నారు. స్టేషన్లో పని చేసే పీఎస్ ల వివరాలను అడిగి తెలుసుకున్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ఎంతటి వారినైనా ఉపేక్షించ వద్దన్నారు.