

మంత్రాలయం: విద్యార్థులకు ముగిసిన పదో తరగతి పరీక్షలు
మంత్రాలయం నియోజకవర్గంలో పదో తరగతి పరీక్షలు మంగళవారం ముగిశాయి. పెద్దకడబురు మండల కేంద్రంలోని ఏపీ మోడల్ స్కూల్, జిల్లా పరిషత్ హైస్కూల్, కేజీబీవీ కళాశాలలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లతో పరీక్షలు నిర్వహించారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, ఎస్సై నిరంజన్ రెడ్డి పర్యవేక్షణలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. పరీక్షలు ముగిసిన తర్వాత, విద్యార్థులు తమ స్నేహితులతో విడిపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు.