సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ అమలు చేసిన సంక్షేమ పథకాలే తమ పార్టీని గెలిపిస్తాయని కాటసాని శివ నరసింహారెడ్డి అన్నారు. గురువారం నాడు గడివేముల మండలంలోని పెసరవాయి గ్రామంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా గ్రామంలోని ప్రతి ఇంటికి తిరుగుతూ రానున్న ఎన్నికల్లో తమ పార్టీకి అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని కోరారు. గ్రామ వైసీపీ నాయకుడు శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాటసాని శివ నరసింహారెడ్డికి గజమాలతో సత్కారం చేశారు.